ప్రతిరోజూ ఓట్స్ తింటే  ఏమవుతుందో తెలుసా..

ఇటీవల కాలంలో ఓట్స్‌ వాడకం బాగా పెరిగింది. చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ని ఎక్కువగా తింటున్నారు.

ఓట్స్‌లో ప్రొటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, పొటాషియం, ఐరన్‌, విటమిన్‌ బీ6, మెగ్నీషియం, కాల్షియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి.

రోజు ఉదయం పూట ఓట్స్ తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు.

ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

 రోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా ఓట్స్ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు

ఓట్స్‌లో సపోనిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలైన ఎక్జిమా, సోరియాసిస్ వంటి వాటిని దూరం చేస్తాయి.

 ఓట్స్‌లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.