పచ్చి ఉల్లిపాయ తింటే  పొట్టలో ఏమవుతుందో తెలుసా?

ఉల్లిపాయలో విటమిన్-సి, బి6, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

పచ్చి ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి.

పచ్చి ఉల్లిపాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలోనూ, కొలెస్ట్రాల్ నియంత్రణలోనూ సహాయపడుతుంది.

పచ్చిఉల్లిపాయలలోని సమ్మేళనాలు శోథనిరోధక ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఇందులో ఉండే అధిక విటమిన్-సి కంటెంట్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

పైబర్ సమృద్దిగా ఉండటం వల్ల పచ్చి ఉల్లిపాయలు తింటే జీర్ణక్రియ బాగుంటుంది. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో పచ్చి ఉల్లిపాయ సహాయపడుతుంది.