రోడ్డు పక్కన జ్యూస్  తాగుతున్నారా.. జాగ్రత్త..

చాలా మంది ఎక్కువగా రోడ్డు పక్కన అమ్మే జ్యూస్ లను తాగుతుంటారు.

కానీ, అలా రోడ్డు పక్కన ఉన్న ఫ్రూట్ జ్యూస్‌ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోడ్డు పక్కన ఉన్న ఫ్రూట్ షాప్‌లో జ్యూస్ తాగితే వాటి వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే, రోడ్డుపై వెహికిల్స్ అదే పనిగా తిరుగుతుంటాయి.

దాని నుండి వచ్చే దుమ్ము, ధూళి పక్కనే ఉన్న ఫ్రూట్స్‌పై పడే ప్రమాదం ఉంది.

అంతేకాకుండా, షాప్ నిర్వహకులు ఏ మాత్రం పరిశుభ్రత లేకుండా, నాణ్యత లేకుండా కూడా జ్యూస్ తాయారు చేసే అవకాశం ఉంటుంది.

వాటిని మనం తీసుకోవడం వల్ల మోషన్స్, ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

 కాబట్టి, రోడ్డు పక్కన ఉన్న షాప్‌లో జ్యూస్ తాగేటప్పుడూ జాగ్రత్తగా ఉండండి.