కూరలో కరివేపాకులా తీసేస్తున్నారనే సామెత ఉంది. కానీ కరివేపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతారు.
ఈ ఆకు ఆహార రుచిని పెంచడమే కాకుండా.. శరీరాన్ని సైతం బలోపేతం చేస్తుంది.
వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని అంటారు.
మానసిక అనారోగ్యం, క్యాన్సర్, డయాబెటిస్ తదితర వ్యాధుల చికిత్సలో ఈ ఆకు అద్భుతంగా పని చేస్తుంది.
అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. కరివేపాకును న్యూరో ప్రొటెక్టివ్‌గా పరిగణిస్తారు. అవి అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ ఆకులో విటమిన్లు ఏ, బీ, సీ, ఈతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం తదితర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మెదడుకు అవసరమైన ఎంజైమ్‌లను సమతుల్యం చేస్తుంది.
ఈ ఆకులో మిథనాల్ ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఈ ఆకు సహాయపడతాయి.
శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను పెంచడంలో కరివేపాకు దోహదపడుతుంది.