మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందనడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

రోజూ చేసే పనుల విషయంలోనూ ఏకాగ్రత కుదరదు

అకారణంగా దుఃఖం పొంగుకొస్తుంది

చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంటుంది. 

ఒకప్పుడు సరదాగా చేసిన పనులన్నిటిపైనా విరక్తి కలుగుతుంది.

ఏదో అగాథంలో కూరుకుపోతున్నామన్న భావన వెంటాడుతుంది. 

జీవితం వ్యర్థమని పలుమార్లు అనిపిస్తుంటుంది. 

వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా నిర్లక్ష్యం పెరుగుతుంది.