ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు బాగా పెరిగిపోయాయి.
చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల దగ్గరి వరకు అందరూ గుండెపోటుల బారిన పడుతున్నారు.
ఇలాంటి సమయంలో గుండె ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బీట్ రూట్ జ్యూస్ తాగటం వల్ల గుండె పని తీరు మెరుగుపడుతుందని, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తగ్గిందని ఓ పరిశోధనలో తేలింది.
యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు 70 ఏళ్ల వయసులో ఉన్న కొంతమందిపై పరిశోధనలు చేశారు.
అత్యధిక స్థాయిలో నైట్రేట్స్ కల్గిన ఈ జ్యూస్ వల్ల యువకులకు కూడా చాలా లాభాలు ఉన్నాయి.
ఈ జ్యూస్ తాగితే.. నోట్లో, పొట్టలో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు.
బీట్ రూట్ జ్యూస్‌లోని నైట్రేట్స్ .. నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి.. రక్త నాళాలను రిలాక్స్ చేస్తాయని అన్నారు.
హై బీపీతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందని వెల్లడించారు.
Related Web Stories
రోజూ రాత్రి ఒక లవంగం తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
స్విమ్మింగ్ VS సైక్లింగ్.. బరువు తగ్గేందుకు ఏది మంచిది..
పదేపదే గోర్లు కొరుకుతున్నారా? అయితే జాగ్రత్త..
మహా అద్భుతం ప్రతి రోజూ నైట్త తింటే ఎన్ని లాభాలో