పవర్ హౌస్ ఆఫ్ ప్రోటీన్స్ 'రాజ్మా'

గుండె, షుగర్ వ్యాధిగ్రస్థులకు వీటిని వరంగా భావిస్తారు. అందుకే వీటిని 'కిడ్నీ బీన్స్'గా పిలుస్తారు.

వీటిలో అన్ని రకాల ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి 'పవర్ హౌస్ ప్రోటీన్స్‌'గానూ వ్యవహరిస్తాం.

ఈ బీన్స్‌లో ప్రోటీన్లు, ఫైబర్ అధిక స్థాయిలో ఉంటాయి.

వీటిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. కావున బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి డైట్.

కిడ్నీ బీన్స్‌లో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులు నివారిస్తుంది.

రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి.

శరీరానికి హానిచేసే టాక్సిన్లు, మలినాలను బయటకు పంపడంలో ఇవి సాయపడతాయి.

రాజ్మాను తరచూ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవచ్చు.