నిద్ర తగ్గితే బరువు పెరుగుతామనే విషయం అందరికీ తెలిసిందే! అయితే నిద్ర పెరిగినా ఇదే ఫలితం దక్కుతుంది.
ఉదయాన్ని ఉపవాసంతో మొదలుపెట్టి, మధ్యాహ్నం అవసరానికి మించిన ఆకలితో ఎక్కువ ఆహారం తినడం అనారోగ్యకరం.
ఈ అలవాటు అధిక బరువుకు దారి తీస్తుంది. కాబట్టి తగినన్ని పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు ఉండే బలవర్థకమైన బ్రేక్‌ఫా్‌స్టతో రోజును మొదలుపెట్టాలి.
మటన్, బీఫ్, పోర్క్ వంటి మాంసాలు. ఇవి ప్రొటీన్లు ఉన్నా ఇందులో ఉన్న సాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. రెగ్యులర్‌గా ఇవి తినడం వల్ల బరువు కారణమవుతూ ఉంటాయి
స్వీట్ గా ఉండే కూల్‌డ్రింక్స్ కూడా బరువు పెరగడానికి కీలకమైన కారకం.
ఈ రకమైన ఆహార పదార్థాలను మితంగా తీసుకోవడం ద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఆరోగ్యంగా ఉండాలంటే నూనె తక్కువగా ఉండే ఆహారాలు, తాజా పండ్లు, కూరగాయలు, తక్కువ ప్రాసెసింగ్ ఉన్న పదార్థాలు తీసుకోవడం మంచిది.