మానసిక పరిస్థితిని అనుసరించి ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉత్సాహంగా లేకపోవడానికి కారణం డోపమైన్ లేకపోవడం. కాబట్టి ఇలాంటి సమయాల్లో చిక్‌పీస్, గుడ్లు, జున్ను తదితరాలను తీసుకోవాలి.

మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే.. ఓట్స్, అరటిపండు, విత్తనాలను తినాలి.

బ్లూబెర్రీస్ తినడం వల్ల ఏకాగ్రత మెరుగుపడడంతో పాటూ జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.

రోజంతా పని చేసి అలసిపోయిన సమయంలో ఖర్జూరం, బాదం, వేరుశెనగ వంటివి తీసుకోవాలి.

ఆందోళనగా ఉండడంతో పాటూ నాడీ వ్యవస్థ సరిగా పని చేయని సమయంలో గుమ్మడి గింజలు తీసుకోవాలి.

డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల నిరుత్సాహం, విసుగు దూరమవడంతో పాటూ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.

డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల నిరుత్సాహం, విసుగు దూరమవడంతో పాటూ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.