వేసవిలో శరీరాన్ని చల్లబరిచే  ఆహారాలను తీసుకోవడం  చాలా ముఖ్యం.

అలాంటి వాటిలో పూల్‌ మఖానా కూడా ముఖ్యమైనది అంటున్నారు పోషకాహార నిపుణులు.

వేసవిలో బాడీ హీట్‌ తగ్గించడంలో మఖానా మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందని చెబుతున్నారు.

పూల్‌ మఖానా పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది.

మఖానా బ్లడ్ షుగర్ లెవల్స్‌ని సరి చేస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుందని చెబుతున్నారు.

మఖానాని పాలలో నానబెట్టి తినడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది.

పాలు, మఖానా రెండింటిలోనూ కాల్షియం ఎక్కువగా ఉంటుంది.  ఎముకలు బలంగా మారతాయి.

వృద్ధాప్యంలో వచ్చే ఎముకల సమస్యల్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

పాలలో నానబెట్టిన మఖానా తీసుకోవటం వల్ల ఒత్తిడి తగ్గి నిద్ర నాణ్యత పెరుగుతుంది.యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి.