మైదా పిండి.. ఇంత డేంజరా బాబోయి..

మైదా పిండితో చేసిన వంటలు రుచిగా ఉంటాయి. కానీ అవి ప్రాణం తీసే రుచికరమైన విషమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

మైదా పిండి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరగదని వారు స్పష్టం చేస్తున్నారు. 

రీఫైన్డ్ చేసిన గోధుమ పిండినే మైదా అంటారు. అందులో పోషకాలు, ఫైబర్ ఉండదు.

మైదాలో గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.

మైదా తరచూ తింటే షుగ‌ర్ వ‌చ్చే అవకాశాలు పెరుగుతాయి. షుగ‌ర్‌ పేషంట్లు మైదాతో చేసిన వంటలు తింటే ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. 

మైదా తరచూ తీసుకోవడం వల్ల బ‌రువు పెర‌గ‌డంతోపాటు టైప్-2 డ‌యాబెటిస్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.

అలాగే మైదా పిండితో చేసిన వంటకాలు అతిగా తినడం వల్ల శ‌రీరం శ‌క్తి కోల్పోతుంది. నీర‌సం అవహిస్తోంది. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న పెరుగుతాయి.

మైదాతో చేసిన వంటల బదులు.. పండ్లు, నట్స్‌ వంటివి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మైదాతో చేసిన వంటల బదులు.. పండ్లు, నట్స్‌ వంటివి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.