ఎందుకంటే దొరికింది తినే అలవాటు మెదడులోని న్యూరాన్‌లను దెబ్బతీస్తాయి

మెదడు బాగా పనిచేయడానికి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం తిసుకొవడం అవసరం

మనం తీసుకునే ఆహారం శరీరంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

నేటి వేగవంతమైన జీవితంలో అధికంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు జనాలు అలవాటు పడుతున్నారు.

ఈ రకమైన ఆహారాలు తినడం వల్ల మెదడు శక్తి మందగిస్తుంది.జ్ఞాపకశక్తిని కూడా బలహీనపరుస్తుంది

వైట్ బ్రెడ్‌, బిస్కెట్లు, పిజ్జా, పాస్తా, మీట్‌, సాసేజ్‌లు, సలామీలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి.

శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన పండ్ల రసాలలో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉంటుంది. ఇది మెదడులోని డోపమైన్ స్థాయిలను అసమతుల్యత చేస్తుంది.

మీ మెదడు, మనస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధమైన విషపూరిత ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.