పీరియడ్స్ రెగ్యులర్‍గా రావడం లేదా..  ఈ ఒక్క డ్రింక్ తాగి చూడండి..

నానబెట్టిన నల్ల ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి హార్మోన్లను నియంత్రించడంలో, నెలసరి అసౌకర్యం తగ్గించడంలో సహాయపడతాయి.

కుంకుమ పువ్వు నెలసరి సమయంలో వచ్చే నొప్పిని, నెలసరి కారణంగా వచ్చే మూడ్ స్వింగ్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

చియా సీడ్స్‍లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది వాపును, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది.

కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా క్రమరహిత పీరియడ్స్ సమస్య నుండి బయటపడవచ్చు.

పీరియడ్స్‌కు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో యోగా లేదా వ్యాయామం చేయడం ప్రభావవంతంగా ఉంటుంది.

పీరియడ్స్ సరిగా రాకపోతే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆహారంలో ఆరోగ్యంగా ఉంచే అవసరమైన పోషకాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి.

శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన శరీర బరువు కలిగి ఉంటే పీరియడ్స్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.

ఆహారంలో అల్లం, దాల్చిన చెక్కను చేర్చుకోవడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రెండూ క్రమరహిత పీరియడ్స్ సమస్యను దూరం చేయడంలో సహాయపడతాయి.