కళ్ల మీద కంప్యూటర్‌ ఒత్తిడా?

కంప్యూటర్‌ ముందు అధిక సమయం పని చేయడం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి.

వాపు, కంటి నుంచి నీరు కారడం, కళ్లు మసకబారడం వంటి లక్షణాలు తలెత్తుతాయి.

వీటిని తొందరగా గుర్తించి అవసరమైన చికిత్స అందించాలి.

లేకుంటే తీవ్ర అనర్థాలకు దారి తీస్తాయి.

కంటికి సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తితే ఆలస్యం చేయకుండా వెంటనే కంటి వైద్యుడ్ని కలవాలి.

కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు పోషకాహారాన్ని తీసుకోవాలి.

బచ్చలికూర, సాల్మన్, ట్యూనా, గుడ్లు, గింజలు, బీన్స్, క్యారెట్, పాలకూర వంటి ఆహారాన్ని డైట్ లో భాగం చేసుకోవాలి. 

ఆఫీస్ లో సౌకర్యవంతంగా ఉండే కుర్చీని ఎంచుకోవాలి. ప్రతి 20 నిమిషాలకు మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.