మీరు తెచ్చే నెయ్యి ఒరిజినలేనా.. ఇలా తెలుసుకోండి

ఆయుర్వేదంలో నెయ్యికి ఒక ప్రత్యేక స్థానం ఉంది

నెయ్యిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది

అయితే కల్తీ నెయ్యితో అనారోగ్యం బారిన పడుతున్నారు కొంతమంది

షాపులో నుంచి తెచ్చిన నెయ్యి  ఒరిజినలా.. కల్తీదా తెలుసుకోవడం చాలా సింపుల్

కొద్దిగా నెయ్యిని చిన్న గిన్నెలో వేసి.. అందులో రెండు మూడు చుక్కల నీళ్లు వేయాలి

నీటిలో నెయ్యి కలిసిపోకుండా విడిపోయినట్లుగా ఉన్నా..

నీటి చుక్కలు నెయ్యిపై తేలుతున్నా అది కల్తీదని అర్ధం

స్వచ్ఛమైన నెయ్యిలో నీటిని వేస్తే అందులో కలిసిపోతుంది

స్వచ్ఛమైన నెయ్యి లేత బంగారు పసుపు రంగులో ఉంటుంది

నెయ్యి ఎక్కువగా తెల్లగా ఉంటే అది ఒరిజినల్ కాదని అర్థం

నెయ్యి కొనేటప్పుడు రంగును జాగ్రత్తగా పరిశీలించాలి

నెయ్యిని ఫ్రిడ్జిలో పెట్టినప్పుడు గట్టిగా మారితే అది స్వచ్ఛమైనదిగా గుర్తించవచ్చు