కురులకు మనం అందించే  పోషణ అంటే... కొబ్బరి నూనె పెట్టడమే

కురులకు పోషకాలు అందివ్వడమే కాదు, మెరిసేలానూ చేస్తాయి.

చల్లని నూనె మాడులోకి ఇంకదు.  గోరువెచ్చగా వేడిచేస్తేనే పోషకాలు కుదుళ్ల వరకూ వెళతాయి.

పొడిబారిన కురులకు నూనె దివ్యౌషధం. అలాగని జిడ్డు తల ఉన్నవారూ పెడతానంటే కుదరదు. 

నూనె పెట్టడం అంటే తలంతా పూయడమే కాదు... మసాజ్‌ కూడా చేయాలి.

విశ్రాంతిని కలిగించడంతోపాటు రక్తప్రసరణ బాగా జరిగి, కురులు పెరిగేలానూ చేస్తాయి.

5-10 నిమిషాల్లోపు మసాజ్‌ చేసుకుంటే సరిపోతుంది.

కనీసం గంటసేపు ఉంచుకోవాలి. అప్పుడే పోషకాలు కురులకు అందుతాయి