ఈ గింజలతో షుగర్ కంట్రోల్..!

పుచ్చకాయ అంతా తింటారు. కానీ వాటి గింజలను పారేస్తుంటారు.

పుచ్చకాయ గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఈ గింజల్లో మెగ్నీషియం, జింక్, ఐరన్, ప్రోటీన్ తదితర పోషకాలుంటాయి.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి.

ఈ గింజల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడంలో సహాయపడుతుంది. 

ఇది మలబద్ధకం, అపాన వాయువు, అజీర్ణం తదితర సమస్యలను తొలగిస్తుంది. 

ఈ గింజలు గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.  

ఈ గింజలు మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. డయాబెటిక్ సమస్య ఉన్న వారికి ఇవి మేలు చేస్తాయి.

ఈ గింజలు చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి. జుట్టును బలంగా, ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది.