స్ట్రాబెర్రీస్‌తో ఈ ప్రయోజనాలు తెలిస్తే  అస్సలు వదలరు..

 స్ట్రాబెర్రీస్‌లో ఫైబర్‌, ప్రొటీన్‌, విటమిన్‌ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, ఆంథోసైనిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

స్ట్రాబెర్రీస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు.. శరీర కణాలను ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. 

స్ట్రాబెర్రీలోని విటమిన్ సీ.. T-కణాలు, B-కణాల విస్తరణకు ప్రోత్సాహిస్తుంది.

 స్ట్రాబెర్రీస్‌లోని పొటాషియం హైపర్‌టెన్షన్‌‌ను నియంత్రిస్తుంది. 

స్ట్రాబెర్రీస్‌లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలోని క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని నిరోధించగలవని పరిశోధకులు చెబుతున్నారు.

స్ట్రాబెర్రీస్‌లో ఫోలేట్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది DNA సంశ్లేషణ, అమైనో యాసిడ్స్‌ విచ్ఛిన్నం, ప్రోటీన్ల బిల్డింగ్ బ్లాక్‌లతో సహా కీలక ప్రతిచర్యలకు అవసరం.

గర్భిణీలు ఫోలిక్‌ యాసిడ్‌ కచ్చితంగా తీసుకోవాలి. ఇది కడుపులోని బిడ్డ ఎదుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది.