ఇప్ప పువ్వు సారాతో మోకాళ్ల నొప్పులకు చెక్..!

ఇప్ప పువ్వు సారా తాగితే ఆరోగ్యకరమని ఒక ప్రజాప్రతినిధి వ్యాఖ్యానించారు. గతంలో ఈ సారా తాగి.. 117 ఏళ్లకు పైగా ప్రజలు జీవించారని గుర్తు చేశారు. 

ఈ ఇప్ప పువ్వు సారాను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తే.. ప్రభుత్వానికి లక్షల కోట్లలో ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. 

ఈ సారాను విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోందన్నారు.

ఇంతకీ ఇప్ప పువ్వు సారా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? అంటే..

ఇప్ప పువ్వు సారా.. గిరిజనులు సాంప్రదాయకంగా తయారు చేస్తారు. దీనిని పరిమితంగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఇప్ప పువ్వులో ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో సహయపడతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తోంది. 

ఇప్ప పువ్వు సారా తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు.. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందుల ఉపశమనానికి ఇది కొంత వరకు సహాయపడుతుంది. 

ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా.. కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్సగా వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు  సూచిస్తున్నారు.