ఎండు రొయ్యలు తింటున్నారా..

ఎండు రొయ్యలు ఆహారంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండు రొయ్యలు తింటే అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు.

ఎండు రొయ్యలు  అందులోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఎండు రొయ్యల్లోని విటమిన్ బి 12, మెగ్నీషియం మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.

 ఎండు రొయ్యలు జుట్టును దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.

వారానికోసారి కానీ 15 రోజులకోసారి కానీ ఎండు రొయ్యలు తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 ఎండు రొయ్యలను తింటే చర్మ సమస్యలు దూరం అవుతాయి. వీటి లోని విటమిన్స్ చర్మం మెరిసేలా చేస్తుంది

 మొత్తంగా ఎండు రొయ్యలను తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి, ఎండు రొయ్యల వాసన చూసి ఛీ..ఛీ అనకుండా నిరభ్యంతరంగా వీటితో కూర తాయారు చేసి కుమ్మేయండి.