పోషకాల గని.. గోరుచిక్కుడు

గోరుచిక్కుడులో పోషకాలు మెండుగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. స్వల్పంగా పిండి, పీచు పదార్థాలు ఉంటాయి. 

వీటిలో విటమిన్ ఎ, సి, కెలతోపాటు విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9 ఉంటాయి.

ఈ గోరుచిక్కుడు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. 

రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

వీటిలోని కాల్షియం, ఫాస్పరస్ వల్ల ఎముకలు, కండరాలకు బలాన్ని ఇస్తుంది. 

కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం తదితర పోషకాలు వీటిలో ఉంటాయి.  

వీటిలో ఐరన్ ఉంటుంది. ఇది శరీరంలో రక్తహీనతను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. 

జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యర్థాలను బయటకు పంపే గుణాన్ని కలిగి ఉంటుంది. 

స్థూలకాయాన్ని అరికట్టడంలో  గోరుచిక్కుడు కీలకంగా వ్యవహరిస్తోంది. 

వీటిలో హైపోగ్లైసియామిక్ గుణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. టెన్షన్‌ని తొలగిస్తుంది.