తరచూ నీళ్లు తాగితే  క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..

 తరచూ నీరు తాగితే  నోరు పొడిబారదు. 

దీంతో, నోటి దుర్వాసన, పళ్లు పుచ్చిపోవడం వంటి సమస్యలు రావు.

నోరు శుభ్రంగా ఉంచుకునేందుకు  తరచూ నీరు తాగాలి.

దీంతో, పంటిపై ఎనామెల్ పొర సురక్షితంగా ఉండి దంత సమస్యలు దరిచేరవు.

పళ్లపై గారపట్టకుండా ఉండేందుకు నీరు ఉపకరిస్తుంది. పళ్లపై కావిటీస్ వంటివి రాకుండా నిరోధిస్తుంది.

చిగుళ్ల ఆరోగ్యానికి నీరు ఎంతో అవసరం. చిగుళ్లకు తగినంత తేమ అందితే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

కాలక్రమేణా దంతాలు యాసిడ్ల ప్రభావాన పాడైపోతాయి. అయితే, తరచూ నీరు తాగడంతో ఈ పరిస్థితి నివారించవచ్చు.