పానీ పూరికి యువతలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సాయంత్రం అయ్యిందంటే యువతీయువకులు పానీ పూరి బండి వద్దకు పరిగెత్తుతారు.

ముఖ్యంగా ఎక్కువ మంది అమ్మాయిలకు పానీ పూరి అంటే అమితమైన ఇష్టం.

అయితే అపరిశుభ్ర వాతావరణం, శుచిగా చేయని పానీ పూరి ఆరోగ్యానికి చేటు.

ప్లేట్ పానీ పూరిలో 200నుంచి 300 క్యాలరీలు ఉండి బరువు పెరగడానికి దారితీస్తుంది.

దీనిలో వాడే పదార్థాలు, ముఖ్యంగా నీరు శుభ్రంగా లేకపోతే ఫుడ్ పాయిజన్ అవుతుంది.

పానీ పూరిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు జీర్ణ సమస్యలు తెచ్చిపెడతాయి.

చింతపండు నీరు, మసాలాలు కడుపులో మంట, అజీర్తిని కలిగిస్తాయి.

సోడియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది.