జాజికాయను వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసా..!

జాజికాయను అతిగా తింటే వికారం, వాంతులు కలిగిస్తుంది.

దీనిలో ఉండే విరిస్టిసిన్ వల్ల భ్రాంతులు కలుగుతాయి. ఈ ప్రభావం రోజుల తరబడి ఉండవచ్చు.

మైకం, గందరగోళం వంటి లక్షణాలు కూడా జాజికాయతో కలుగుతాయి.

దీనితో జ్ఞాపశక్తి  మీద పటుత్వం తగ్గుతుంది.

జాజికాయను అతిగా తీసుకోవడం వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది.

జాజికాయ నోరు, గొంతు పొడిగా మారేలా చేస్తుంది. ఇది అసౌకర్యానికి దారి తీస్తుంది.

ఆందోళన కూడా పెరిగే అవకాశం ఉంది.