పిస్తా పాలు తాగితే.. బోలెడన్ని ప్రయోజనాలు

పిస్తా పాలులో ఎన్నో పోషకాలు ఉన్నాయని, దీనిని మన రోజూవారీ డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

పిస్తా పాలులో మోనోశాచురేటెడ్‌ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పిస్తా పాలులో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. పిస్తా పాలు కేలరీల ‘ఇన్‌టేక్‌’ తగ్గిస్తాయి. బరువును కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి.

పిస్తా పాలులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి.. వీటిని తరచుగా తీసుకుంటే, ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి.

పిస్తా పాలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సాహించి, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

పిస్తా పాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించి, అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి.

పిస్తా పాలలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

పిస్తా పాలలో విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు.. వయస్సు సంబంధిత మచ్చల క్షీణత, కంటిశుక్లం నుంచి కళ్లను రక్షించడానికి సహాయపడతాయి.

పిస్తా పాలలోని ప్రోటీన్ కంటెంట్.. కండరాల పెరుగుదలకు తోడ్పడుతాయి. వ్యాయామం తర్వాత మరమ్మతులకు దోహదపడతాయి.