కొన్ని లక్షణాల ద్వారా పెద్ద పేగు కేన్సర్‌ను ముందే పసిగట్టవచ్చు. ప్రధానంగా ఈ 5 లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే జాగ్రత్తపడాలి.

నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం పాటు మలబద్ధకం లేదా విరోచనాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

మలంలో రక్తం పడడం కూడా కొన్నిసార్లు పెద్ద పేగు కేన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది.

పొత్తికడుపులో అసౌకర్యంగా ఉండడంతో పాటూ గ్యాస్, తిమ్మిరి లేదా నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి.

ఉన్నట్టుండి బరువు తగ్గిన సందర్భాల్లో కూడా వైద్యుడిని సంప్రదించాలి.

మల విసర్జన తర్వాత కూడా కడుపు ఖాళీ అయినట్లు అనిపించపోవడం కూడా పెద్ద పేగు కేన్సర్‌కు సంకేతం కావొచ్చు.