మీ వంటింట్లో ఉండేవే..  ఇలా తీసుకుంటే షుగర్ కంట్రోల్..! 

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండే పసుపు ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు పాలలో పసుపు వేసుకుని తాగితే మంచిది.

దాల్చిన చెక్క కార్బోహైడ్రేట్లను త్వరగా రక్తంలో కలవనివ్వదు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగపరుస్తుంది. గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను నియంత్రిస్తాయి. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి తర్వాతి రోజు ఉదయం వడకట్టి తాగితే మంచిది.

ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత జీలకర్రను కాస్త నమలడం చాలా మంచిది. జీర్ణక్రియ సాఫీగా సాగడంతో పాటు రక్తంలోకి గ్లూకోజ్‌ను వెంటనే విడుదల కానివ్వదు.

ధనియాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. పరగడుపునే ధనియాల రసం తాగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది.

టీ, గోరువెచ్చని నీరు లేదా పాలతో కలిపి లవంగాలను తీసుకోండి. రక్తంలో షుగర్ స్థాయులను క్రమబద్ధీకరించడంలో లవంగాలు సహాయపడతాయి.

వెల్లుల్లిని నేరుగా తిన్నా లేదా భోజనం ద్వారా తీసుకున్నా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది.

ఆవాలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. వాటిల్లో ఉండే కొన్ని రసాయనాలు బ్లడ్ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.