కంట్రీ చికెన్ vs బ్రాయిలర్ చికెన్  ఎది మంచిది..

నాటుకోడి చికెన్ లేదా బ్రయాయిలర్ చికెన్ ఈ రెండిటిలో ఏది ఎక్కువ ఆరోగ్యకరమో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్, చేపలు తినే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇందులో చికెన్ ప్రియులు ఎక్కువ మందే ఉంటారు.

చికెన్ రుచి అద్భుతంగా ఉంటుంది. ప్రోటీన్ ఉంటుంది తక్కువ ధరలోనే అందుబాటులో కూడా లభిస్తుంది. అయితే నాటుకోడి లేదా బ్రాయిలర్ చికెన్ రెండిటిలో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?

నాటుకోడి సహజంగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ పెరిగే ఈ కోడి శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇది ఎలాంటి మందులు లేకుండా పెరిగే కోడి. ఆరోగ్యానికి చాలా మంచిది.

నాటుకోడి మాంసం శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.

నాటుకోడి గుడ్లలో ఉన్న ప్రొటీన్, కాల్షియం గర్భిణీ స్త్రీలకు, వారి కడుపులోని శిశువులకు అవసరమైన పోషకాలను ఇస్తుంది.

పురుషుల్లో నరాల బలహీనత, వీర్యం నాణ్యతకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించడంలో ఇది సహాయపడుతుంది

బ్రాయిలర్ చికెన్ తక్కువ ధరలో దొరుకుతుంది. కానీ ఇది కృత్రిమంగా పెరుగుతుంది.

దాని పెంపకం సమయంలో హార్మోన్లు, యాంటీబయాటిక్స్ వంటివి ఎక్కువగా వాడతారు. దీని వల్ల దీన్ని తరచుగా తినేవారికి కొలెస్ట్రాల్ పెరగడం, తక్కువ రోగనిరోధక శక్తి, హార్మోన్లు సమతుల్యం కాకపోవడం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

నాటుకోడి ఆరోగ్యానికి మంచిదైనా బీపీ లేదా కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువగా తినకూడదు.