చికెన్‌గున్యా అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది ఈడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన దోమ కుట్టినప్పుడు మనుషులకు సంక్రమిస్తుంది.
ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అకస్మాత్తుగా అధిక జ్వరం రావడం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు రావడం, తలనొప్పి, కండరాల నొప్పి, వికారం, వాంతులు, అలసట వంటివి సమస్యలు వస్తాయి.
కీళ్ల నొప్పి, చర్మ దద్దుర్లు, కళ్ళ ఎర్రబడటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి.
చికెన్‌గున్యా వ్యాధి సోకిన చాలా మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన 3-7 రోజుల తర్వాత లక్షణాలు మొదలవుతాయి.
ముఖం, చేతులు, కాళ్లపై ఎర్రగా చిన్న మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా జ్వరం వచ్చిన 2–5 రోజుల తర్వాత కనిపిస్తాయి.
కొన్నిసార్లు కడుపునొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కొంతమందికి కళ్ళు ఎర్రగా కనిపించవచ్చు.
అలాగే అలసట, శరీరం మొత్తం నొప్పి, బలహీనత సహజంగా కనిపిస్తాయి.
పై లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.చికిత్సను ఆలస్యం చేయకుండా తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు.