భవిష్యత్ లో గుండె జబ్బులు  రాకుండా జాగ్రత్త  పడాలని భావిస్తున్నారా

ప్రతిరోజు బ్రౌన్​ రైస్ తినడం వల్ల ఈ సమస్యలు మటుమాయం అవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మనం తినే అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత గొప్పగా భావిస్తున్నాం. 

ముత్యాల్లా తెల్లగా పాలిష్ పట్టించిన బియ్యాన్ని తినడమే నాగరికత అని అనుకుంటున్నాం.

దంపుడు బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది మొలకెత్తిన బ్రౌన్ రైస్ కూడా తీసుకుంటారు.

డయాబెటిస్​ను అదుపులోకి తెచ్చుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

దంపుడు బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

దీన్ని తినడం వల్ల ఇన్సులిన్​తో వచ్చే చిక్కులు తగ్గుతాయి. దంపుడు బియ్యంలో కార్పోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి.