చలికాలంలో మనకు ఎక్కడ
చూసినా నారింజ పండ్లు విరివిగా దొరుకుతుంటాయి.
నారింజ ఎంత ఇష్టపడతామో వాటి తొక్కలను పక్కన పాడేస్తాం
తియ్యతియ్యగా.. పుల్లపుల్లగా.. ఉండే వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు.
కమలాపండు తొక్కలో ఉండే సిట్రస్ ఇంటిని శుభ్రపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది
నారింజ తొక్కలను తీసుకొని వాటిని వెనిగర్‌తో కలిపి గాలి పోని జార్ లేదా మేసన్ జార్లో రెండు, మూడు వారాలు నిల్వ చేయండి.
ఆ తర్వాత వెనిగర్‌ను వడకట్టి స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకోండి.
దానిని మీ కిచెన్ క్యాబినెట్లు, స్టవ్‌పై కొన్ని చుక్కలు వేసి క్లీన్ చేసుకున్నారంటే చాలు మీ వంటగది తళతళ మెరవడం ఖాయం.
నారింజ తొక్కలతో మంచి టీ బ్యాగ్‌లను తయారు చేసుకోవచ్చు.
వీటిలో సిట్రస్ ఉంటుంది కాబట్టి మీరు టీ తయారు చేసుకుని తాగారంటే అటు టేస్ట్‌తో పాటు విటమిన్ సి, మరిన్ని పోషకాలు లభిస్తాయి.
ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. తర్వాత టీ చేసుకునేటప్పుడు ఈ పొడిని అందులో వేసుకుని తాగాలి.
Related Web Stories
ప్రొటీన్ ఏది ఎక్కువ ఎగ్స్ Vs పన్నీర్ ఏది మంచిది?
రోజూ కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే.. ఈ వ్యాధులన్నీ పరార్..!
పైనాపిల్ వారికి విషంతో సమానం..
వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..