మునగ చెట్టే ఒక దివ్య ఔషధం. ఆ చెట్టు ఆకు, కాయ, గింజ, బెరడు, వేరు అన్ని ఔషధాలుగా ఉపయోగిస్తారు.
ముఖ్యంగా మునగ చెట్టు ఆకును ఎండబెట్టి పొడిగా చేస్తారు. దీనిని మొరింగా పౌడర్ అని కూడా పిలుస్తారు.
దీనిని వివిధ ఆహార పదార్థాలు, ఔషధాలు, జుట్టు, చర్మ సంరక్షణ తయారీలో ఉపయోగిస్తారు. ఈ పొడిని రోజూ మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
విటమిన్లు ఏ,సీ, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, రాగి, ఫోలిక్ ఆమ్లం, పిరిడాక్సిన్ నికోటినిక్ ఆమ్లం తదితర పోషకాలు.. అదికూడా అధికంగా ఉంటాయి.
ఇది రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎముకలు, దంతాలను బలంగా మార్చుతుంది. హార్మోన్ అసమతుల్యత ఉన్న వారిలో వీటిని బ్యాలన్స్ చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. గుండె సంబంధిత అనారోగ్యాల నుంచి కాపాడుతుంది.
జుట్టు రాలడం, ఉబ్బసం, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి దూరం చేస్తుంది.
మునగాకు పొడిని రోజూ ఆహారంలో తీసుకోవచ్చు. లేదా కారం పొడిగా తయారు చేసుకుంటారు. ఆహారంలో మొదటి ముద్దలో ఒక చెంచా ఈ కారం పొడి వేసుకుని తినడం వల్ల శరీరం తొందరగా వీటిలోని పోషకాలను గ్రహిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్న వారికి ఇది చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
మునగాకు పొడితో తయారు చేసేన టీని మొరింగా టీ పేరుతో మార్కెట్లో విక్రయిస్తారు. శరీరాన్ని డీటాక్సిఫై చేసుకునేందుకు ఇది బాగా పనిచేస్తుంది.
మునగాకు పొడిని నేరుగా తీసుకునేందుకు కొందరు ఇష్టపడరు. వారు వీటిని ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇవి మీ ఎనర్జీ లెవెల్స్‌ను చక్కగా మెయింటైన్ చేస్తుంది.