స్ట్రాబెర్రీలు నేరుగా తినడం వల్ల  కలిగే లాభాలు..

స్ట్రాబెర్రీ ఒక రుచికరమైన, పోషకాలు పుష్కలంగా ఉన్న పండు. తినేటప్పుడు దీని రుచి పుల్లగా, తియ్యగా చాలా బాగుంటుంది.

 స్ట్రాబెర్రీలలో బోలెడన్ని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

ప్రతిరోజూ స్ట్రాబెర్రీలను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, అనేక వ్యాధులు మీ దరి చేరవు.

 ఇవి గుండెకు మేలు చేస్తాయి. మీరు రోజూ స్ట్రాబెర్రీలను తింటే, మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

స్ట్రాబెర్రీలు తినడం వల్ల మీ దంతాలు బలంగా అయ్యి మెరుస్తూ ఉంటాయి. 

స్ట్రాబెర్రీలలో ఉండే కీమో నివారణ లక్షణాలు క్యాన్సర్ కణాలను నివారించడంలో సహాయపడతాయి. 

 స్ట్రాబెర్రీలలో మెగ్నీషియం ఉంటుంది, ఇది ఎముకలను బలపరుస్తుంది.