ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా..?
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
పచ్చి ఉల్లిపాయల్లో నీటిశాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల బాడీ హైడ్రేట్‌గా, చల్లగా ఉంటుంది.
వేసవిలో చెమట వల్ల తగ్గిన ఎలక్ట్రోలైట్స్ కూడా ఉల్లిపాయ తినటం వల్ల బ్యాలెన్స్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి ఉల్లిపాయల్లోని గుణాలు గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను దరిచేరకుండా చేస్తాయి.
ఉల్లిపాయల్లో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఇవి బాడీ టెంపరేచర్‌ని తగ్గిస్తాయి. వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల జుట్టు, చర్మానికి కూడా మంచిదని చెబుతున్నారు నిపుణులు,
వేడి పెరగడం వల్ల వచ్చే మొటిమలు, మచ్చలు సమస్యలు రావు. జుట్టు రాలడం తగ్గుతుంది.
మరీ ఎక్కువగా తినకూడదు, మోతాదు పరిమాణంలోనే తినటం మంచిదని గుర్తు పెట్టుకోవాలి.
Related Web Stories
బార్లీ వాటర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
నల్ల టమోటాలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..
మేక రక్తం తింటే మంచిదేనా..
వేసవిలో ఈ పండును రోజూ ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో..