మనం ఉదయం మిగిలిపోయిన అన్నం రాత్రిపూట తింటాము.. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయం తింటాము.
ఈ మిగిలిపోయిన అన్నాన్ని తినడం మంచిదేనా..? కాదా..? అనే సందేహాలు అందరిలో ఉంటాయి..
మిగిలిపోయిన అన్నాన్ని సరిగ్గా నిల్వ చేస్తే, దాని పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. విటమిన్ బి – కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు చెక్కుచెదరకుండా అలానే ఉంటాయి.
మిగిలిపోయిన అన్నాన్ని పెరుగుతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ రోగులు వేడి అన్నం బదులుగా చల్లని అన్నం తినమని సలహా ఇస్తారు.
మిగిలిపోయిన అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ఒకటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మిగిలిన అన్నంలో బాసిల్లస్ – సెరియస్ బ్యాక్టీరియా ఉంటాయి
బ్యాక్టీరియాతో కలుషితమైన అన్నాన్ని తినడం వల్ల వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
సరైన నిల్వ లేకుండా మిగిలిపోయిన అన్నాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మిగిలిపోయిన అన్నాన్ని తినడం వల్ల చాలా మందికి కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి