పెరుగులో పచ్చి మిరపకాయ కలిపి   తింటే ఈ సమస్యలన్నీ దూరం..

పెరుగులో పచ్చిమిర్చి వేసి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పచ్చి మిరపకాయలను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

ఈ రెండింటి కలయిక శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

పచ్చిమిర్చి కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పెరుగులో ప్రోటీన్ కడుపు నిండుగా ఉంచుతుంది.

 అతిగా తినకుండా నిరోధించి, బరువును నియంత్రించుకోవడంలో సహాయపడుతుంది

పెరుగులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి, ఇవి ఎముకలు, కండరాలు, రోగనిరోధక శక్తికి సహాయపడతాయి.

ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా కలపవచ్చు