నేరేడు పండ్ల విత్తనాలు పారేస్తున్నారా..  ఇలా వాడితే ఆ సమస్యలు పోతాయ్..

నేరేడు పండ్ల‍లో ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపు సమస్యలు తొలగిపోతాయి.

ఇందులోని పోషకాలు పేగులను ఆరోగ్యంగా ఉంచి జీర్ణక్రియ సక్రమంగా నిర్వహించేలా ప్రోత్సహిస్తాయి. 

మంచి జీర్ణక్రియ కోసం నేరేడును ఉప్పుతో కలిపి తీసుకుంటే చాలా మంచిది.

నేరేడు విత్తనాలలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మొటిమల సమస్యను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేసేందుకు సహాయపడతాయి.

బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే జీవక్రియను మెరుగుపడుతుంది. 

నేరేడులో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఈ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.