ప్రతి వంటగదిలో రకరకాల సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. వాటిలో లవంగం ఒకటి. విటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి
ప్రతి ఉదయం ఒక లవంగాన్ని నమిలి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
ప్రతి ఉదయం ఒక లవంగాన్ని నమలడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
ఇవి అజీర్ణం, గ్యాస్ మరియు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
ప్రతిరోజూ ఉదయం ఒక లవంగాన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి.
లవంగాలు నమలడం వల్ల చిగుళ్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
లవంగాలను ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది..
దీనివల్ల మైగ్రేన్లు, తలనొప్పి తగ్గుతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు లవంగాల పొడిని కలిపి కూడా తీసుకోవచ్చు..
భోజనం తర్వాత 1-2 లవంగాలను నమలడం వల్ల గ్యాస్/ఎసిడిటీని నివారించవచ్చు. లవంగాలలో ఆల్కలీన్, కార్మినేటివ్ లక్షణాలు ఉన్నాయి.. ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.