వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా..?

  మొక్కజొన్న కంకులు తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు.ఈ మొక్కజొన్నలు కేవలం టైమ్‌పాస్‌ స్నాక్‌ ఐటమో, లేదంటే, తినటానికి రుచిగా ఉంటాయనే కాదు.. ఆరోగ్యానికి కూడ చాల మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.

మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా వ్యాధులను నివారిస్తుంది.

మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇందులోని విటమిన్ సి చర్మ వ్యాధులను నివారిస్తుంది.

మొక్కజొన్న గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీని దూరం చేస్తుంది.

మొక్కజొన్నలో కాపర్, ఐరన్‌తోపాటు మరిన్ని ఆవశ్యక ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా మార్చడంలో సహాయపడతాయి.

మొక్కజొన్నలోని ఆవశ్యక పోషకాలు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించడంలో దోహదపడతాయి.