వానకాలంలో కలబంద తీసుకోవడం వల్ల  ఎన్ని ప్రయోజనాలో..

వర్షా కాలంలో కలబందను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా..

వర్షా కాలంలో ఎక్కవ తేమ కారణంగా మనకు జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు పెరుగుతాయి.

కలబంద జెల్‌ను కొబ్బరి నూనెతో కలిపి తలకు రాసుకుంటే జుట్టు బలపడడంతో పాటు, చుండ్రు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

వర్షాకాలం వచ్చిందంటే జనాలు జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్యం సమస్యలను ఎదుర్కొంటారు.

కలబందను తీసుకోవడం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడమే కాకుండా వర్షా కాలంలో ఎక్కువగా వచ్చే  కడుపు నొప్పి, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.