పేగు ఆరోగ్యానికి 6 ప్రోబయోటిక్ సూపర్ ఫుడ్స్..

వేసవి కాలంలో డీహైడ్రేషన్ పెరిగి అజీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువ. ఇవి క్రమంగా పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

జీర్ణవ్యవస్థను సహజంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోబయోటిక్ అధికంగా ఉండే  ఈ 6 పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోండి

పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో పేగులోని బాక్టీరియాకు మద్దతు ఇచ్చే ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇంట్లో తయారుచేసిన ఊరగాయలలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. అవి జీర్ణక్రియకు సహాయపడతాయి. మీ భోజనానికి కొత్త రుచిని జోడిస్తాయి.

పులియబెట్టిన తర్వాత వేసిన ఇడ్లీలలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది  కడుపును తేలికగా చేసి పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

కంజి పులియబెట్టిన ఓ పానీయం. క్యారెట్లు లేదా బీట్‌రూట్‌లతో దీన్ని తయారు చేస్తారు. ఉప్పగా, కారంగా ఉండే ఇందులో ప్రోబయోటిక్స్‌ సమృద్ధిగా ఉంటాయి. భోజనాల మధ్యలో దీన్ని తాగండి.

ఆపిల్ ఫైబర్, ప్రోబయోటిక్స్ కు గొప్ప మూలం. ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా పేగు ఆరోగ్యంగా ఉంటుంది.

భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల కడుపు ప్రశాంతంగా ఉంటుంది. పేగు బాక్టీరియా పెరుగుతుంది.