2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుంది

ఐఎంఎఫ్ భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ వెల్లడి

ఇంతకుముందు భారత్ 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందలేదు, కానీ దీనిని సాధించవచ్చన్నారు

2023 చివరి మూడు నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే 8.4 శాతం వృద్ధిని సాధించింది

ఇది గత ఒకటిన్నర సంవత్సరాల్లో అత్యంత వేగంగా నమోదు అయిందన్నారు

అక్టోబరు-డిసెంబర్‌లో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను 7.6 శాతానికి తీసుకెళ్లింది

భారత్ 8 శాతం వృద్ధిని సాధిస్తే 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్న సుబ్రమణియన్

1991 నుంచి భారతదేశ సగటు వృద్ధి 7 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉందన్న సుబ్రమణియన్

ఉద్యోగాల కల్పన కోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రస్తావన

భూమి, కార్మిక, మూలధనం, లాజిస్టిక్స్, తయారీ రంగంలో సంస్కరణలు అవసరమన్న సుబ్రమణియన్