మీరు కొంత డబ్బును ఇన్వెస్ట్‌ చేయాలని చూస్తున్నారా? అయితే వీటి గురించి తప్పక తెలుసుకోండి

ఎందుకంటే ఇటివల కాలంలో ఆర్థిక మోసాలతోపాటు పలు చోట్ల నష్టాలు కూడా ఎక్కువవుతున్నాయి

ఇటివల కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి కొంత మంది కంపెనీ ఎత్తేశారు

ఇంకొన్ని చోట్ల చిట్టీల పేరుతో అనేక మంది వద్ద పలువురు డబ్బులు తీసుకుని కనిపించకుండా పోయారు

మరికొంత మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించి చీటింగ్

ప్రతి నెల కొంత పెట్టుబడి పెడితే పెద్ద ఎత్తున బంగారం ఇస్తామన్న కేసులు కూడా ఉన్నాయి

మరోవైపు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు వాటి గురించి తెలుసుకుని చేయండి

ఒకవేళ స్టాక్ మార్కెట్ ఒకేసారి క్రాష్ అయితే పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది

భూమి కూడా తీసుకునే ముందు దాని మార్కెట్ విలువను తెలుసుకుని కొనుగోలు చేయాలి

ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టేముందు ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేయండి

ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుందని తెలియని వ్యక్తులను నమ్మి ఎక్కువ డబ్బులు ఇవ్వకండి