ఈ రకమైన దుస్తుల్లో వెనకబడిన భారత్ 

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు మిక్స్‌డ్ సింథటిక్స్‌తో తయారైన దుస్తులు కొనుగోలు చేస్తున్నాయి

వీటి తయారీలో భారత్ వెనకబడి దుస్తుల ఎగుమతుల వాటా క్షీణించిందన్న GTRI నివేదిక

ఇతర దేశాల్లో ఎక్కువ ఫార్మల్, స్పోర్ట్స్, ఫ్యాషన్ దుస్తుల తయారీలో సింథటిక్ ఫ్యాబ్రిక్‌లను ఉపయోస్తున్నారు

అభివృద్ధి చెందిన దేశాలు కొనుగోలు చేసే దుస్తుల్లో 70 శాతం మిక్స్‌డ్ సింథటిక్స్‌తో తయారవుతున్నాయి

ఫ్యాషన్ పరిశ్రమ ఇప్పుడు సింథటిక్‌ను ఎక్కువగా కోరుకుంటుంది 

భారతదేశ వస్త్ర ఎగుమతుల్లో 40 శాతం కంటే తక్కువ సింథటిక్‌ ఉండటంతో వస్త్ర ఎగుమతులు బలహీనం

కాటన్ దుస్తుల ఉత్పత్తికి భారత్‌లో వస్త్ర పరిశ్రమ యూనిట్లు సంవత్సరానికి ఆరు నెలలు నడుస్తాయి

మిగిలిన ఆరు నెలల్లో దుస్తులకు ఆర్డర్‌లు తక్కువగా ఉండటం వలన చాలా యూనిట్లను మూసివేయడం లేదా తక్కువ సామర్థ్యంతో ఉంటాయి

అయితే సింథటిక్స్‌లోకి ప్రవేశించడం వల్ల వస్త్ర పరిశ్రమ ఏడాది పొడవునా నడిచి వేతనాలు అనేక రెట్లు పెరుగుతాయని నివేదిక పేర్కొంది