మరికొన్ని రోజుల్లో టీవీ రేట్లు పెరుగనున్నాయా? 

ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి స్మార్ట్‌ టీవీల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి

ఇటివల అంతర్జాతీయ మార్కెట్లో వీటి ప్యానెళ్ల ధరలు పెరిగాయి

దీంతో స్మార్ట్‌ టీవీ కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను కూడా పెంచాల్సి రావచ్చని కౌంటర్‌ పాయింట్‌ నివేదిక వెల్లడి

అయినప్పటికీ ఈ ఏడాది స్మార్ట్‌ టీవీల విక్రయాలు 9 శాతం మేర పెరగవచ్చని అంచనా

వినియోగదారులు పెద్ద సైజు టీవీలకు అప్‌గ్రేడ్‌ అవుతుండటం ఇందుకు దోహదం చేస్తుందని ప్రకటన

గత ఏడాదిలో దేశంలో స్మార్ట్‌ టీవీల విక్రయాలు 16 శాతం తగ్గాయి

గత ఏడాది ఆర్థికపరమైన సవాళ్లతోపాటు డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోవటం కారణమని నివేదిక వెల్లడి

మరోవైపు ఈ కామర్స్‌ పోర్టళ్ల ద్వారా టీవీల కొనుగోళ్లు పుంజుకోవడం కూడా ప్రధాన కారమని స్పష్టం

ఖరీదైన క్యూఎల్‌ఈడీ టీవీలకు క్రమంగా ఆదరణ పెరుగుతోందని పేర్కొన్న నివేదిక

ఓటీటీ, ఐపీఎల్‌ వంటి స్పోర్ట్స్‌ ఈవెంట్లు స్మార్ట్‌ టీవీలకు డిమాండ్‌ పెంచుతున్నాయని నివేదిక స్పష్టం