Home » TOP NEWS
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాల్ట్ (65) మరియు కోహ్లీ (62 నాటౌట్) అర్ధ శతకాలు గెలుపులో కీలకంగా నిలిచాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని కూలదొచ్చే కుట్రలో భాగంగా ఈ చర్యలు తీసుకుందని ఆరోపించారు
కర్ణాటక హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై పాశవిక హత్యాచారం జరగగా, నిందితుడు రితేశ్‌కుమార్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమర్చారు. ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి
ధీరజ్ బొమ్మదేవర నాయకత్వంలోని భారత రికర్వ్ ఆర్చరీ జట్టు వరల్డ్‌కప్ స్టేజ్-1 ఫైనల్లో చైనా చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. భారత జట్టు ఫైనల్‌లో 1-5 పాయింట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది
భూ భారతి వెబ్‌సైట్‌ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్‌లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా.. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న. గవర్నర్‌కు ఫిర్యాదు చేసి బెంగళూరు అభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు
పీఎస్‌ఎల్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ పాలస్తీనా కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రతీ సిక్సర్ మరియు వికెట్‌కి రూ.లక్ష విరాళంగా ఇవ్వనున్నారు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు మహా కూటమి పార్టీల భేటీ ఈ నెల 17న జరగనుంది. సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్లేషణ
ఐపీఎల్‌లో బీసీసీఐ కొత్త అనుభూతి కోసం రోబో డాగ్‌ను ప్రవేశపెట్టింది. డానీ మారిసన్ వాయిస్ కమాండ్‌లకు అనుగుణంగా రోబో డాగ్ పరిగెత్తి ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేసుకుంటూ అలరించింది
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా రాయబారి కీత్ కెల్లాగ్ నియంత్రణ మండలాలుగా విభజన ప్రతిపాదించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని ఆయన వివరణ ఇచ్చుకున్నారు