Home » TOP NEWS
తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులపై రాష్ట్రపతి (కేంద్ర ప్రభుత్వం) నుంచి మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.
ఇరాన్-అమెరికా అణు చర్చలపై ఒమన్ వేదికగా మొదటి పరోక్ష చర్చలు జరిగాయి. రెండు దేశాలు ఏప్రిల్ 19న మళ్లీ చర్చలకు నిర్ణయం తీసుకున్నాయి
జమిలి ఎన్నికల ద్వారా దేశానికి సుస్థిర పాలన సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు
నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈడీ, కాంగ్రెస్ నేతల సోనియా, రాహుల్‌గాంధీకి సంబంధించిన రూ. 661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రారంభించింది
తమిళంలో నేమ్‌బోర్డులు ఏర్పాటు చేయని సంస్థలకు మే నెల నుంచి రూ. 2వేల జరిమానా విధించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, దుకాణాలు, హోటళ్లు ఇలా అన్ని చోట్ల తమిళంలో పెద్దగా, ఇంగ్లిష్‌లో చిన్నగా పేర్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది
ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో 248 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. వీరిలో అధికంగా వైసీపీ కార్యకర్తలు ఉండగా, దీని వల్ల వైజాగ్ నాక్ మూతపడే పరిస్థితి ఏర్పడింది
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలపై చేసిన అసత్య ఆరోపణలను తిరస్కరించిన టీడీపీ నేతలు, ప్రజల్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే ఈ కుట్రను నమ్మవద్దని కోరారు
ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి కుముదిని లాఖియా (95) వృద్ధాప్య కారణాల వల్ల అహ్మదాబాద్‌లో మృతి చెందారు. ఆమె పద్మవిభూషణ్‌తో పాటు అనేక పురస్కారాలు పొందారు
అరెస్టు సమయంలో నిందితుడికి కారణాలు చెప్పకపోతే బెయిల్ మంజూరు చేయవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం కారణాలు చెప్పడం తప్పనిసరి అని పేర్కొంది
పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదమేనని పోలీసు దర్యాప్తు స్పష్టం చేసింది. బైక్ హెడ్‌లైట్ పనిచేయకపోవడం, మద్యం సేవించి స్కిడ్ కావడం ప్రమాదానికి కారణంగా నిర్ధారణ అయ్యింది