Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైఎస్ఆర్‌టీపీ అజెండా ప్రకటించిన షర్మిల

హైదరాబాద్: వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ రాయదుర్గంలో జరుగుతోంది. సభలో షర్మిల మాట్లాడుతూ.. తమ పార్టీ అజెండాలో మూడు ముఖ్యమైన అంశాలను ప్రకటించారు. సంక్షేమం.. స్వయం సంవృద్ధి.. సమానత్వం సాధన దిశగా తమ పార్టీ సాగుతుందన్నారు.


నాన్న మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని, శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్ అని ఆమె పేర్కొన్నారు. ఆయన జయంతి రోజున ఆయన అడుగుల్లో నడిచేందుకు వైఎస్ఆర్‌టీపీని స్థాపించామన్నారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి వచ్చామన్నారు.  


ఇవాళ్టికీ వైఎస్ ఓ రోల్ మోడల్ అన్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్.. పావలా వడ్డీ ఇచ్చారని, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని జలయజ్ఞానికి రూపకల్పన చేసిన దార్శనికుడు వైఎస్ అన్నారు. డాక్టరా.. ఇంజినీరా.. ఎంబీయేనా అన్నది తేడా లేకుండా ఉచిత చదువులకు అవకాశం ఇచ్చిన నేత ఆయన అన్నారు. పేద విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించారని, ఆరోగ్యశ్రీ ఇచ్చిన నేత అన్నారు. 


Advertisement
Advertisement