YS Viveka Caseలో వెలుగులోకి సంచలన నిజాలు.. వణికిపోతున్న నిందితులు.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2022-03-15T16:47:35+05:30 IST

వైఎస్‌ వివేకా హత్య కేసులో రోజుకో సంచలన నిజం వెలుగులోకి వస్తోంది. సూత్రధారులు, పాత్రధారుల విషయంలో కడప జిల్లా ప్రజలే కాదూ, ఏపీ జనం కూడా ఫుల్‌

YS Viveka Caseలో వెలుగులోకి సంచలన నిజాలు.. వణికిపోతున్న నిందితులు.. ఏం జరుగుతుందో..!?

వైఎస్‌ వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నవారి వెనుక ఉన్నది ఎవరు...? ఈ తెర వెనుక సూత్రధారులను సీబీఐ గుర్తించిందా? త్వరలో వారికీ సీబీఐ తన విచారణా రుచిని చూపించనుందా? కడప జిల్లాలో నిత్య సంచలనంగా మారిన వైఎస్‌ వివేకా హత్యకేసులో సీబీఐ నెక్స్ట్‌ స్టెప్‌ ఎలా ఉండబోతోంది... ఎవరి గుండెలు దడదడలాడుతున్నాయి..? ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం.....


వివేకా హత్య కేసులో సంచలన విషయాలు

వైఎస్‌ వివేకా హత్య కేసులో రోజుకో సంచలన నిజం వెలుగులోకి వస్తోంది. సూత్రధారులు, పాత్రధారుల విషయంలో కడప జిల్లా ప్రజలే కాదూ, ఏపీ జనం కూడా ఫుల్‌ క్లారిటీకి వచ్చేశారు. ఈ ప్రమాదం వస్తుందని గ్రహించిన కొంతమంది విచారణ ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. పైగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా అధికారపార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నవారే. అందుకే ఎప్పడు ఎవరి పేరు బయటకు వస్తుందోననే ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. మరో పక్కేమో సీబీఐ స్పీడు పెంచింది. దీంతో సీబీఐకు కళ్ళెం వేయడానికి అధికార పార్టీకి చెందిన ఒక టీమ్‌ రంగంలోకి దిగింది. సీబీఐపైనే ఎదురు కేసులు పెట్టిస్తే విచారణ మందగిస్తుందని ఈ బృందం భావించిందిట. అంతే వెంటనే పనిమొదలుపెట్టింది. సీబీఐ అనుమానితులుగా భావిస్తున్నవారిని తమ ఫోల్డ్‌లోకి తీసుకుంది. వారికి రకరకరాల ఎరలు వేసింది.


సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు

ఆ పై వారితో సీబీఐ అధికారులు వేధిస్తున్నారంటూ ఇందులో భాగంగా తొలుత అనంతపురం జిల్లా యాడికి లో వున్న గంగాధర్ రెడ్డి అలియాస్ కువైట్ గంగాధర్ ను రంగంలోకి దింపింది. ఇతగాడు సరాసరి జిల్లా ఎస్పీని కలిశాడు. సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. పైగా ప్రాణ భయం కూడా ఉందన్నాడు. ఇక్కడితో ఆగకుండా మీడియా ముందుకూ వచ్చాడు.  ఈకథనంతా సదరు టీమే వెనకుండి నడిపించిందనేది విశ్వసనీయ సమాచారం. తరువాత మరో ఫిర్యాదూ చేయించారు. ఈసారి పులివెందులకు చెందిన భరత్‌ యాదవ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈయన మీడియా ముందుకు వచ్చి సీబీఐ తనను వేధిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. 


దీంతో ఈ కథ ఎవరు నడుపుతున్నారంటూ సీబీఐ ఆరా తీసింది. ఓహో ఇదా సంగతి అని తెలుసుకుంది. దీనిపై మరింత లోతుగా విచారణ చేసిన సీబీఐకి కూడా దిమ్మతిరిగే నిజాలు తెలిశాయట. వివేకా దగ్గర పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డితో ఏకంగా సునీత కుటుంబమే వివేకా హత్యకు పాల్పడిందని చెప్పించాలని సదరు టీమ్‌ ప్రయత్నించిందని సీబీఐ గుర్తించిందట.  ఇంతటితో ఆగని ఆ తెరవెనుక బృందం ఈసారి మరో అస్త్రాన్ని బయటకు తీసింది. పులివెందులకు చెందిన ఉదయకుమార్‌తో సీబీవిచారణాధికారి రామ్‌సింగ్‌పై కడప కోర్టులో కేసు వేయించింది. 


అసలు నిందితుల గుండెల్లో గుబులు

ఈ కథ హైకోర్టుకు చేరింది. అనుమానితులను విచారించడం వేధింపు ఎలా అవుతుందంటూ హైకోర్టు తలంటి, ఈ కేసును ఇంతటితో ఆపండంటూ పిటిషనర్‌కు ఇటీవల దస్తగిరి పులివెందుల కోర్టులో రెండోసారి వాంగ్మూలం ఇవ్వడంతో అసలు నిందితుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయట. దస్తగిరి మరోసారి ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి ప్రస్తావన చేసి ఉండవచ్చనే ఆందోళన వ్య్తక్తమవుతోందిట. ఈ కేసు తుది దశకు చేరడంతో సీబీఐ అధికారులు కూడా వేగం పెంచారు. సీబీఐని అవినాష్‌ గుమ్మం వరకూ రానీయకూడదనే ఈ ఫిర్యాదుల పర్వం ప్రారంభించిన  తెరవెనుక బృందానికి హైకోర్టు తీర్పుతో సౌండ్‌ లేకుండా పోయిందట. ఇలాంటి ఫిర్యాదులు ఎవరు చేయించారు... ఎందుకు చేయించారనే విషయం సీబీఐ ఇప్పటికే కూపీలాగిందట. అందుకే సైలెంట్‌గా తన పని తాను చేసుకు పోతోంది. దీంతో ఫిర్యాదులు చేయించినవారు కూడా ఇప్పుడు వణుకుతున్నారుట. అసలు నిందితులతోపాటు ఈ కొసరు నిందితులకూ ముచ్చెమటలు పడుతున్నాయని కడప జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-03-15T16:47:35+05:30 IST