YSRTP : ఇందిరాశోభన్‌కు YS Sharmila ఫోన్..

ABN , First Publish Date - 2021-08-20T18:17:44+05:30 IST

వైఎస్ఆర్‌టీపీ కీలక నేత ఇందిరాశోభన్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే..

YSRTP : ఇందిరాశోభన్‌కు YS Sharmila ఫోన్..

హైదరాబాద్‌ : వైఎస్ఆర్‌టీపీ కీలక నేత ఇందిరాశోభన్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. రాజీనామా ఎందుకు చేస్తున్నా అనే విషయాలపై పెద్ద ప్రకటనే చేశారు. అయితే ఆమెతో వైఎస్సార్‌టీపీ నేతల ప్రస్తుతం చర్చిస్తున్నారు. మరోవైపు పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఇందిరాశోభన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. సుమారు అరగంటకుపైగా వీరిద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రాధాన్యత పరంగా ఎలాంటి లోటు ఉండదని ఇందిరాశోభన్‌కు షర్మిల హామీ కూడా ఇచ్చారు. అయితే.. షర్మిలకు ఆమె ఏమని రిప్లయ్ ఇచ్చారనే విషయం తెలియరాలేదు.


త్వరలోనే ప్రకటిస్తా..

అంతకుముందు రాజీనామా లేఖలో.. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాను. ప్రజాజీవితంలోనే ఉంటా. జనం కోసమే కదులుతా. ప్రజల కోసమే అడుగులు వేస్తా. ఇదే ఆదరాభిమానాలను ఇక ముందు కూడా మీ నుంచి నాకు ఉంటాయని, నన్ను నడిపిస్తారని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. ఇన్నాళ్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నాకు సహకరించిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాములుఅని ఇందిరాశోభన్ రాజీనామా ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-08-20T18:17:44+05:30 IST